ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Durga Temple: దుర్గగుడి అభివృద్ధి పనులకు బ్రేక్​...కారణం ఏంటంటే.. - విజయవాడ దుర్గగుడి దేవస్థానం

విజయవాడ దుర్గగుడికి అనుబంధంగా కల్యాణ మండపాలు, కాటేజీలు నిర్మించాలని సిద్ధం చేసిన ప్రణాళికలు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాజెక్ట్‌ చేపట్టాలనుకునే స్థలం విషయంలో వివాదం ఏర్పడటంతో పనులు నిలిచిపోయాయి.

Durga temple development projects
అర్థంతరంగా ఆగిపోయిన దుర్గగుడి అభివృద్ధి ప్రాజెక్టులు

By

Published : Oct 24, 2021, 1:03 PM IST

అర్థంతరంగా ఆగిపోయిన దుర్గగుడి అభివృద్ధి ప్రాజెక్టు

విజయవాడ దుర్గగుడికి అనుబంధంగా కల్యాణ మండపాలు, కాటేజీలు నిర్మించాలని సిద్ధం చేసిన ప్రణాళికలు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాజెక్ట్‌ చేపట్టాలనుకునే స్థలం విషయంలో వివాదం ఏర్పడటంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారు. తీరా ఇప్పుడు పలు కారణాలతో పనులు నిలిపివేయడంతో దుర్గగుడికి సంబంధించిన భారీ ప్రణాళిక ఆగిపోయింది.

ఏటా రెండు కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే విజయవాడ దుర్గగుడికి.. ఆ మేరకు సౌకర్యాలు మాత్రం లేవు. చాలాకాలంగా కాటేజీలు కట్టాలని, కల్యాణమండపం నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఎట్టకేలకు ఈ ఏడాది ప్రణాళికలు రూపొందించి.. టెండర్లకు కూడా వెళ్లగా.. ఆదిలోనే ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురయ్యాయి. కుమ్మరిపాలెంలో ఉన్న తితిదే స్థలాన్ని తమ అవసరాల కోసం వాడుకోవాలని దుర్గగుడి ఆలయ అధికారులు భావించారు. ప్రభుత్వం కూడా ఈ స్థలాన్ని ఆలయానికి కేటాయిస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చింది. తాజాగా 6కోట్ల రూపాయలతో కల్యాణ మండపాలు, పార్కింగ్‌ చేపట్టడానికి టెండర్లను సైతం ఆహ్వానించారు. తీరా తితిదే అధికారులు ఆ స్థలం తమదని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సూచించిడంతో పనులు నిలిచిపోయాయి.

ఈ స్థలంలో రెండోదశలో 100కోట్ల రూపాయలతో మల్టీస్టోరెడ్‌ పార్కింగ్, కాటేజీలు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కాటేజీలు లేకపోవడంతో.. గుడికి వచ్చే భక్తులు వచ్చినవాళ్లు.. వచ్చినట్టే వెళ్లిపోవాల్సిన పరిస్థితి. కుమ్మరిపాలెంలో చాలాకాలంగా స్థలం ఖాళీగా ఉండటంతో.. ఆలయ అవసరాల కోసం వినియోగిస్తూ వస్తున్నారు. ఈ స్థలంలో భారీ ప్రణాళిక చేపట్టి టెండర్ల ప్రక్రియ ఆరంభించగానే..అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ స్థలానికి బదులుగా..తితిదేకు ఇచ్చిన స్థలం వాళ్లు స్వాధీనం చేసుకోలేదు. ఆ దిశగా ఆలయ అధికారులు కూడా ప్రయత్నాలు చేయకపోవడంతో.. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.

ఇదీ చదవండి : JP ON AP POLITICS: రాష్ట్ర రాజకీయ పరిణామాలపై.. జేపీ బహిరంగ లేఖ!

ABOUT THE AUTHOR

...view details