Durga Temple Chairmen On Bhavani Devotes: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు స్పష్టం చేశారు. భవానీ దీక్షా విరమణ ఏర్పాట్లుపై పాలకమండలి సభ్యులతో ఆయన చర్చించారు. గతేడాది ఉత్పన్నమైన సమస్యలను అధిగమిస్తూనే.. ఈ ఏడాది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ ఛైర్మన్ సూచించారు.
ఈ నెల 25 నుంచి 29 వరకు భవానీ దీక్షా విరమణ ఉంటుందని ఆలయ ఈవో భ్రమరాంబ వెల్లడించారు. 25న ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామన్నారు. నాలుగు హోమ గుండాలతో పాటు ఇరుముడులను విప్పేందుకు 50 పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవానీ భక్తులందరికీ డిసెంబర్ 25 నుంచి 29 వరకు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధలు ప్రతిఒక్కరూ పాటించాలని తెలిపారు.