ఈ నెల 17న జరగనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి దేవస్థాన పాలకమండలి చర్చించింది. ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఛైర్మన్ సోమినాయుడు, ఈవో సురేశ్ బాబు ఆవిష్కరించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు సోమినాయుడు తెలిపారు.
మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఆ రోజు ఆన్‌లైన్ టికెట్లు పెంచే యోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. దసరా ఉత్సవాల నిర్వహణకు ఐదు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని ఈవో సురేశ్ బాబు వెల్లడించారు.