ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Drug Mafia: డ్రగ్స్​ మాఫియాలో అధికార పార్టీ నేతల హస్తం: ధూళిపాళ్ల - ఏపీలో డ్రగ్ మాఫియా

డ్రగ్స్​ మాఫియాలో అధికార పార్టీ నేతల హస్తం ఉందన్నది వాస్తవమని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dulipalla narendra On Drug Mafia) విమర్శించారు. వాస్తవాలు కప్పిపుచ్చేందుకే శాంతిభద్రతల సమీక్షలో మాదక ద్రవ్యాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారన్నారు. ముంద్రా పోర్టులో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడిన తర్వాత కాకినాడ తీరంలో వాటికి సంబంధించిన బోట్లు తగలబడుతున్నాయని ఆరోపించారు.

డ్రగ్ మాఫియాలో అధికారపార్టీ నేతల హస్తం
డ్రగ్ మాఫియాలో అధికారపార్టీ నేతల హస్తం

By

Published : Oct 5, 2021, 3:39 PM IST

డ్రగ్ మాఫియాలో అధికారపార్టీ నేతల హస్తం

గుజరాత్ ముంద్రా పోర్టులో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడిన తర్వాత కాకినాడ తీరంలో వాటికి సంబంధించిన బోట్లు తగలబడుతున్నాయని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dulipalla narendra On Drug Mafia) ఆరోపించారు. కాకినాడ తీరంలో పడవ కాలిపోయిన ఘటనపై ప్రత్యక్ష సాక్షులు చెప్పేదానికి భిన్నంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శించారు. కాకినాడ తీరంలో ఎన్నో బోట్లు తగలబడుతుంటే అవి తిరగబడినట్లుగా పోలీసు ఎఫ్ఐఆర్​లు ఉన్నాయని ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాల్లో భాగస్వాములైన వారే పడవల్ని తగలబెడుతున్నారన్న ధూళిపాళ్ల.. అధికార పార్టీకి, పోలీసులకు ఎంతటి విడదీయరాని బంధముందో ఎఫ్ఐఆర్​లను బట్టే అర్థమవుతోందని దుయ్యబట్టారు.

ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి, తమకు కావాల్సిన వ్యక్తులు వ్యాపారం చేసుకునేలా ఎస్ఈబీని ఏర్పాటు చేసుకున్నారని సీఎం జగన్​పై ధూళిపాళ్ల మండిపడ్డారు. వాస్తవాలు కప్పిపుచ్చేందుకే శాంతిభద్రతల సమీక్షలో మాదకద్రవ్యాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారన్న ఆయన.. డ్రగ్ మాఫియాలో అధికారపార్టీ నేతల హస్తం ఉందన్నది వాస్తవమన్నారు. వేల ఎకరాల్లో పండించే గంజాయిని రవాణా చేసేందుకు అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే పెద్ద మాఫియా రాష్ట్రంలో నడుస్తోందని ఆరోపించారు.

డ్రగ్స్‌ ఆరోపణలపై పోలీసులు విచారణ జరపాలి. డీజీపీ తన బాధ్యతలు గాలికి వదిలేశారు. అధికార పార్టీ పెద్దల సేవలో డీజీపీ తరిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్‌ రవాణా బయటపడింది.డ్రగ్స్‌ను చిన్న విషయంగా సీఎం చెబుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక గంజాయి సాగు విపరీతంగా పెరిగింది. దాదాపు 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. వైకాపా నాయకుల కనుసన్నల్లోనే గంజాయి సాగు, రవాణా. కాకినాడ తీరంలో ఇటీవల ఓ ఓడ తగలబడిపోయింది. ఓడలో వచ్చిన మంటలు అనుమానాస్పదంగా ఉన్నాయని స్థానికులు చెప్పారు.- ధూళిపాళ్ల నరేంద్ర, తెదేపా నేత

ఇదీ చదవండి

swecha program: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details