సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి తాడేపల్లి చేరుకుంటున్న 1998 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులను.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇంతవరకూ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 13 జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులను విజయవాడ, గుంటూరులో పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యను చెప్పుకునే అవకాశం పోలీసులు తమకు ఇవ్వటం లేదని వాపోయారు.
'పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి' - సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి యత్నించిన 1998 డీఎస్సీ అభ్యర్థులు
సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని.. 1998 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమ సమస్య పై జగన్ పాదయాత్రలో హమీ ఇచ్చారని.. దానిని అమలు చేయాలని కోరుతూ.. సీఎం కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అక్కడకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించిన 1998 డీఎస్సీ అభ్యర్థుల అరెస్ట్