ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నన్ను అరెస్ట్ చేస్తారా..పోలీస్ స్టేషన్​లో రచ్చరచ్చ - నిజామాబాద్​ వార్తలు

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్​లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఎస్సై నేమ్ ప్లేట్, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు.

drunken man halchal in edapalli police station
తెలంగాణ: నన్ను అరెస్ట్ చేస్తారా..పోలీస్ స్టేషన్​లో రచ్చరచ్చ

By

Published : May 19, 2020, 11:25 PM IST

తెలంగాణ నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం కడ్గం శంకర్ అనే వ్యక్తి ఉపాధి పనులకు వెళ్తుండగా రాజీవ్ నాయుడు దాడి చేశాడని ఎస్సై ఎల్లా గౌడ్ తెలిపారు. కడ్గం శంకర్ ఫిర్యాదుతో రాజీవ్ నాయుడుని పోలీస్ స్టేషన్ తీసుకురాగా... తాగిన మైకంలో వీరంగం సృష్టించాడు.

పోలీసులను బెదిరిస్తూ... ఎస్సై నేమ్ ప్లేట్, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. తలను బల్లకేసి కొట్టుకోవడంతో బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రాజీవ్ నాయుడు ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు తనయుడిగా గుర్తించారు.

ఇదీ చదవండి:

సీఎంకు లైవ్​లో మాట్లాడటం రాదా?: తెదేపా

ABOUT THE AUTHOR

...view details