ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాతో నిలిచిన డ్రంకన్ ‌డ్రైవ్ తనిఖీలు...రోడ్లపైకి యథేచ్చగా మందుబాబులు! - డ్రంకన్ డ్రైవ్ వార్తలు

దారిలో డ్రంకన్ డ్రైవ్ ఉందంటే చాలు మందుబాబులు తమ రూటు మార్చుకుని పోయేవారు. అయితే కరోనా వ్యాప్తి క్రమంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిలిపివేయటంతో యథేచ్చగా మందుబాబులు రోడ్డుపైకి వస్తున్నారు.

vijayawada traffic adcp sarkar
విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్

By

Published : Nov 28, 2020, 1:43 PM IST

విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్

కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని నెలలుగా ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేశారు. తనిఖీలు చేయకపోవటంతో మందుబాబులు యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు వినియోగించే బ్రీత్ ఎనలైజర్ పరికరంలో నోటితో ఊదాల్సి ఉంటుందని....విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ తెలిపారు. నోటి తుంపరుల వల్ల కొవిడ్ వ్యాప్తి జరిగే అవకాశముందని చెప్పారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగానే తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. రక్త పరీక్ష చేయటం ద్వారా ఆల్కహాల్ శాతం తెలుసుకోవచ్చని...ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details