మద్యం సేవించి ఆటో నడిపిన ఓ యువకుడు.. పోలీసులకు దొరిపోతాననే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడ సింగ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పాయకపురానికి చెందిన ఆకుమళ్ల కాజావలి అనే యువకుడు.. విజయవాడలో అద్దె ఆటో నడుపుకుంటున్నాడు. ఆటో నడుపుతూ విజయవాడ సింగ్ నగర్ వచ్చిన కాజావలిని స్థానిక సింగ్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు. చోదకుని పరిస్థితిని గమనించి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించారు. అనలైజర్ 350 పాయింట్లు చూపించగా.. పోలీసులు భారీగా జరిమానా విధిస్తారేమోనన్న భయంతో పక్కనే ఉన్న బుడమేరు మురికి కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు యువకుణ్ని రక్షించారు. కేసు నమోదు చేశారు.
జరిమానా భయంతో.. మురికి కాల్వలోకి మందుబాబు! - మురికి కాల్వలో దూకిన యువకుడు
మద్యం సేవించిన ఓ ఆటో డ్రైవర్ ఎక్కడ పోలీసులకు దొరికిపోతానో అనే భయంతో మురికి కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు యువకుడిని కాపాడారు. పట్టుబడితే పోలీసులు భారీగా జరిమానా విధిస్తారనే భయంతో ఆత్మహత్యకు యత్నించినట్టు యువకుడు తెలిపాడు.
జరిమానా భయంతో మురికి కాల్వలో దూకిన యువకుడు