ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెరిచింది లెక్కలు చూసుకోవటానికేనా?' - krishna distrct

విజయవాడ నగరంలో మద్యం ప్రియులు పెద్ద ఎత్తున దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు వేసుకుని మరీ... పొద్దున్నే బారులు తీరారు.

vijayawada
'తెరిచింది లెక్కలు చూసుకోవటానికే ఆంటా..!'

By

Published : May 4, 2020, 7:48 PM IST

కృష్ణా జిల్లాలోని ఆరెంజ్, గ్రీన్ జోన్ల పరిధిలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. విజయవాడ నగరంలో మద్యం ప్రియులు పెద్ద ఎత్తున దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మాస్కులు ధరించి మరీ క్యూ లైన్లలో నిలబడ్డారు. ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లలో నిలబడిన మద్యం ప్రియులకు రెడ్ జోన్లలో దుకాణాలు తెరవబోవడం లేదని చెప్పగా.. తీవ్ర నిరాశకు గురయ్యారు.

కేవలం లెక్కలు చూసుకునేందుకు మద్యం దుకాణం తెరిచామని.. తమకు ఇంకా అనుమతి రాలేదని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ తీరుపై మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజులుగా మూసి ఉంచిన దుకాణాలు తెరుస్తున్నామని ప్రభుత్వం ఎందుకు ప్రకటించాలని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details