Vijayawada Drugs : కొరియర్లో పార్శిల్ పంపారు.. తిరిగి వెనక్కొచ్చింది.. ఓపెన్ చేసి చూస్తే.. - విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం
13:26 May 01
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం
Drugs in Vijayawada: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. సత్తెనపల్లికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పార్శిల్‌లో డ్రగ్స్ కనుగొన్నారు. అయితే.. ఈ డ్రగ్స్‌ను పార్శిల్ చేసి ఆస్ట్రేలియాకు పంపితే కెనడా వెళ్లింది. దీంతో కెనడా నుంచి వెనక్కి వస్తూ.. బెంగళూరులో ఈ డ్రగ్స్ పార్శిల్ పట్టుబడింది. ఈ పార్శిల్‌లో నాలుగు కేజీల డ్రగ్స్ ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పార్శిల్ తీసుకొచ్చిన కొరియర్ బాయ్ తేజను బెంగళూరు పిలిపించిన కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.
పార్శిల్ పంపిన వారి ఆధార్ కార్డు కూడా నకిలీదేనని బెంగళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు విజయవాడ పోలీసులు. ఇప్పటికే బెంగళూరు అధికారులతో బెజవాడ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ పార్శిల్ లో ఉన్నది 'పిరిడిన్' అనే తెల్ల పౌడర్ ప్యాకెట్‌గా పోలీసులు తేల్చారు. విజయవాడ డీటీఎస్ కొరియర్ నుంచి పార్శిల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు చిక్కుముడి విప్పేందుకు విజయవాడ పోలీసులు బెంగళూరు వెళ్లనున్నారు.
ఇదీ చదవండి :Rape at Repalle: రేపల్లెలో దారుణం.. భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం