ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ నుంచి ఎఫిడ్రిన్ సరఫరా కేసు.. నేటితో ముగియనున్న కస్టడీ

విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ సరఫరా చేసిన కేసులో నిందితుడు అరుణాచలంను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఎఫిడ్రిన్ అక్రమ రవాణాలో కీలక నిందితుల వివరాలు పోలీసులు సేకరించినట్లు సమాచారం. అయితే.. విచారణకు తీసుకున్న మూడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది.

Drugs case Accused Police Custody
Drugs case Accused Police Custody

By

Published : May 16, 2022, 4:43 AM IST

విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ సరఫరా చేసిన కేసులో నిందితుడు అరుణాచలంను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న రామన్ తంగేవి అనే పేరుపై పార్శిల్​ను పంపినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడని సమాచారం. అరుణాచలంకు చెన్నై బర్మాబజార్​లో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు పార్శిల్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎఫిడ్రిన్ అక్రమ రవాణాలో కీలక నిందితుల వివరాలను పోలీసులు కొంత సేకరించారు. అయితే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం చెన్నైకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు.

ABOUT THE AUTHOR

...view details