ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్‌ చేయాలి.. ! - డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వార్తలు

ఎమ్మెల్సీ అనంతబాబును శాసనమండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని.. డ్రైవర్​ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, ఎస్సీ సంఘాల నేతలు గవర్నర్‌ను కోరారు. అనంతబాబు చేతిలో దారుణహత్యకు గురైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు.. గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని.. విజ్ఞప్తి చేశారు.

driver subramanyam family met governor bishwabushan harichandan demanding to birthruff mlc ananthababu
గవర్నర్​ను కలిసిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు

By

Published : Jun 17, 2022, 3:30 PM IST

గవర్నర్​ను కలిసిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ, దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజభవన్‌లో కలిశారు. సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ ఎంక్వైరీ, అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని, ఎమ్మెల్సీని బర్త్​రఫ్ చేయాలని కోరుతూ.. సుబ్రహ్మణ్యం కుటుంబం గవర్నర్ కు వినతి పత్రం అందించారు. తన కొడుకు హత్య విషయంలో న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్​ను కోరినట్లు.. సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ తెలిపారు.

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రాకుండా చూడాలని.. సీబీఐ విచారణ చేయాలని.. దళిత ఐక్య వేదిక నేత కన్వీనర్ బూసి వెంకట్రావు కోరారు. తమ వినతిపై సానుకూలంగా గవర్నర్ స్పందించారని తెలిపారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్ బాబుపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details