ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ - ఏపీ జైళ్ల శాఖలో ఖాళీలు న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖలో అయిదు డ్రైవర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా 688 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు సగటున 140 మంది పోటీపడుతున్నారు.

జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ

By

Published : Jan 12, 2021, 7:04 AM IST

జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణకు సోమవారం చివరి రోజు కావడంతో విజయవాడలోని ఆ శాఖ కార్యాలయం వద్దకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. నేరుగా జైళ్ల శాఖ డీజీ కార్యాలయం నుంచే దరఖాస్తులు తీసుకుని, అక్కడే సమర్పించాలని నిబంధన ఉన్న కారణంగా... చాలామంది వాటిని పొందలేకపోయారు.

ఇంకొందరు నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోయారు. ఈ విషయంపై పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. జైళ్ల శాఖ డీజీ మహ్మద్‌ హసన్‌ రెజా స్పందించారు. దరఖాస్తులు సమర్పించేందుకు.. అందరికీ అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. గడువు ముగిసిందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details