ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వర్షాకాలం వస్తుంది...పోతుంది.. డ్రైయిన్ల పనులు మాత్రం ఎక్కడివి అక్కడే - విజయవాడ లేటెస్ట్​ అప్​డేట్​

drains problems: వర్షాకాలం వచ్చిపోతున్నా.. వర్షపునీటి డ్రైయిన్ల నిర్మాణం మాత్రం ముందుకు సాగటం లేదు. పనులు నిలిచిపోయి మూడున్నరేళ్లు గడుస్తున్నా..విజయవాడ నగర పాలకసంస్థ అధికారులు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. గత కమిషనర్ ఈ విషయం పూర్తిగా మరిచినా..కొత్తగా వచ్చిన కమిషనర్ పట్టించుకుంటారని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. రూ.461 కోట్లతో మెుదలు పెట్టిన పనులు ఆర్ధాంతరంగా నిలిచిపోవటంతో.. నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల డ్రైయిన్ల కోసం తవ్విన గోతుల్లో పిల్లలు పడిన ఘటనలు జరిగినా పట్టించుకున్న వారే లేరు.

drains problems
ముందుకు సాగని డ్రైనేజీ నిర్మాణాలు

By

Published : Feb 24, 2022, 1:33 PM IST

ముందుకు సాగని డ్రైనేజీ నిర్మాణాలు

drains problems: సంవత్సరాలు గడిచిపోతున్నా... ఎన్నో వర్షాకాలాలు వచ్చి పోతున్నా నగరంలో వర్షపునీటి డ్రైయిన్లు మాత్రం పూర్తి కావటం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో అందకపోవటం, గుత్తేదార్ల నిర్లక్ష్య ధోరణే దీనికి కారణాలు అనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమై చకచక నడిచి.. అనంతరం అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీనికి సంబంధిత గత్తేదార్లు అనేక కారణాలు చెప్పింది. పలుచోట్ల స్థలాల్లో ఉన్న ట్రాన్స్​ఫార్మర్ల అడ్డంకి, మరికొన్ని చోట్ల స్థానికులతో ఇబ్బందులు తలెత్తాయి. ఈ సమస్యలను పరిష్కరించటంలో విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ) అధికారులు అశ్రద్ధ వహించారని ఆరోపణలు ఉన్నాయి

drains problems: నాలుగన్నరేళ్ల క్రితం రూ.461 కోట్ల రూపాలతో మెుదలుపెట్టిన ఈ పనుల్లో 50 నుంచి 60 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు మాత్రం ఎక్కడా ఆ పనుల్లో పురోగతి లేదు. ఇప్పుడు పలుచోట్ల మురికి కాలువలను సైతం ఇందులోకి కలిపారు. ఫలితంగా నీరు ఆగిపోయి ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అపార్ట్​మెంట్ల ముందు కట్టిన ఈ డ్రైయిన్ల వల్ల ఆయా కాలనీల వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సగంలో పనులు ఆగిపోవటంతో 10 అడుగల మేర తవ్విన గుంతల్లో పిల్లలు పడిపోతారని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొన్నిచోట్ల ఈ డ్రైయిన్లలో పిల్లులు పడి ప్రమాదాలకు గురైన సందర్భాలున్నాయని చెబుతున్నారు.

"దాదాపు మూడేళ్ల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. ఎల్​ అండ్​ టీ సిబ్బంది పైప్​లైన్​ వేస్తామని పనులు మొదలుపెట్టారు. ట్రాన్స్​ఫార్మర్​ అడ్డు వచ్చిందని చెప్పి పనులు నిలిపివేశారు. మూడేళ్ల నుంచి డ్రైనేజీ తెరిచే ఉంది. వీటిల్లో పడి పిల్లలను ఆస్పత్రిలో చేరిన ఘటనలు కూడా ఉన్నాయి. దోమలు కూడా చాలా ఎక్కువయ్యాయి. వర్షం పడితే మట్టి మొత్తం డ్రైనేజీలోనే చేరుతుంది. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీనివల్ల అనేక వ్యాధులబారిన పడాల్సి వస్తోంది" -కాలనీ వాసులు

drains problems: గత ప్రభుత్వ హయాంలో నగర ప్రజలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నా.. వాననీటి ఇబ్బందిని తొలగించేందుకు వర్షపు నీటి డ్రైయిన్ల నిర్మాణం చేపట్టారు. కానీ ఆయా కారణాలుతో అవి నిలిచిపోయాయి. నగరంలోని ఏ కాలనీలో చూసినా పనులు పూర్తికాలేదు. పైగా సగంలో నిలిచిపోయాయి. వీటి వల్ల ప్రజలు ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. అటు ఆయా కాలనీల సంబంధిత ప్రతిపక్ష కార్పొరేటర్లు ఎన్నిసార్లు వీఎంసీ అధికారులు వద్ద మొర పెట్టుకున్నా సమస్యను మాత్రం పరిష్కరించటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని కౌన్సిల్ సమావేశాల్లో అడుగుతున్నా.. అధికారులు మొద్దు నిద్రపోతున్నారని తెదేపా కార్పొరేటర్​ ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Changes in SSC Exams : ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో భారీ మార్పులు

ABOUT THE AUTHOR

...view details