ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 5, 2020, 8:04 PM IST

ETV Bharat / city

'కొవిడ్ పరీక్షల్లో తేడాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేరడం మేలు'

కరోనా వైరస్‌ సామాజికంగా వ్యాప్తి చెందుతూ... ఎక్కువ మందిని ఆశిస్తోన్న ఈ తరుణంలో సాధారణ జలుబు వచ్చి... ఒకటి రెండు రోజులకు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయడం సరికాదని... ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ కనుమూరి బసవ శంకరరావు అన్నారు. హోం క్వారంటైన్‌ ద్వారా వైద్యం అందించే విధానంపై ఆయన 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Dr. Shankara Rao About Covid care in Home Quarantine
డాక్టర్. కనుమూరి బసవ శంకరరావు

డాక్టర్ కనుమూరి బసవ శంకరరావు

స్వాబ్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా, సీటీ స్కాన్‌ పరీక్షలో పాజిటివ్‌ లక్షణాలు వస్తోన్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ కనుమూరి బసవ శంకరరావు వివరించారు. కరోనా వైరస్‌ సోకిన 60 ఏళ్లు వయసు దాటిన వారిలో ఎలాంటి ఇతర అనారోగ్యాలు లేకపోయినా... లివర్‌, క్రియాటిన్‌ పరీక్షల్లో తేడాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరడం మేలని సూచించారు. ఇతరులు తమ వ్యాధి తీవ్రత ఆధారంగా ఇంట్లోనే ఉండి ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిగతులను పరీక్షించుకుని వైద్యం పొందవచ్చని చెప్పారు. విజయవాడలో సుమారు 200 మందికిపైగా కొవిడ్‌ బాధితులకు హోం క్వారంటైన్‌ ద్వారా వైద్యం అందించినట్టు శంకరరావు 'ఈటీవీ భారత్'తో మాట్లాడిన సందర్భంగా వివరించారు.

ABOUT THE AUTHOR

...view details