ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ramineni foundation award: భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు విశిష్ట పురస్కారం - vijyawada news

డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021 సంవత్సరానికి పురస్కారాలను ప్రకటించింది. త్వరలోనే వీటిని అందించనున్నట్లు రామినేని ఫౌండేషన్​ కన్వీనర్​ పాతూరి నాగభూషణం వెల్లడించారు.

Dr Ramineni Foundation Awards
Dr Ramineni Foundation Awards

By

Published : Nov 6, 2021, 2:14 PM IST

Updated : Nov 6, 2021, 7:32 PM IST

డాక్టర్ రామినేని ఫౌండేషన్.. ఈ ఏడాది పురస్కారాలను ప్రకటించింది. 2021 సంవత్సరానికిగానూ.. భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు డాక్టర్‌ కృష్ణా ఎం. ఎల్ల, భారత్ బయోటిక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎం. ఎల్ల విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం సహా పలువురు విశేష పురస్కారానికి ఎంపికయ్యారు.

గతేడాది అవార్డులు ప్రకటించినా.. కరోనా వల్ల ప్రదానోత్సవ సభ నిర్వహించలేకపోయామని.. రామినేని ఫౌండేషన్​ కన్వీనర్​ పాతూరి నాగభూషణం అన్నారు. అందువల్ల.. ఈ ఏడాది అవార్డులతో పాటు.. గతేడాది అవార్డులను కూడా ఒకే వేదికపై ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 32 రంగాలకు చెందినవారిని.. న్యాయ నిర్ణేతలు అవార్డులకు ఎంపిక చేశారన్నారు.

2021 రామినేని ఫౌండేషన్​ అవార్డులు..

  • విశిష్ట పురస్కారం: భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు డాక్టర్‌ కృష్ణా ఎం. ఎల్ల, భారత్ బయోటిక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎం. ఎల్ల
  • విశేష పురస్కారం: సినీ నటులు కె. బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్, అనస్థీషియా విభాగ అధిపతి డాక్టర్ దుర్గా పద్మజా, తెలుగు సినిమా పాత్రికేయులు యస్.వి. రామారావు

కుటుంబ సభ్యులే సొంత ఖర్చుతో ఈ అవార్డులను అందచేస్తున్నారని పాతూరి నాగభూషణం తెలిపారు. ఎక్కడా పైసా విరాళం తీసుకోకుండా అవార్డులు అందజేయడం విశేషమన్నారు. 1999లో రామినేని ఫౌండేషన్​ను ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 330మందికి రూ.5 వేల చొప్పున స్కాలర్‌షిప్​లు ఇస్తున్నామని.. మంచి ఫలితాలు తెచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేస్తున్నామన్నారు. 150 ప్రభత్వ పాఠశాలలకు ఫౌండేషన్ ద్వారా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు నాగభూషణం తెలిపారు.

ఇదీ చదవండి:

బెజవాడ దుర్గమ్మ: నుదుట రూపాయి బిళ్లంత బొట్టు.. చేతులకు 2 లక్షల గాజులు..!

Last Updated : Nov 6, 2021, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details