BEL New Independent Director: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పార్థసారథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. దీనిపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. పార్థసారథికి లేఖ రాశారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. డైరెక్టర్గా ఆయన సలహాలు, సూచనలతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరింత అభివృద్ధి చెందుతుందని లేఖలో తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి డాక్టర్ పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భాజపా నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలో అత్యంత నిబద్ధతతో పని చేస్తానని పార్థసారథి తెలిపారు. దేశ రక్షణ రంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తుట్లు తెలిపారు.