ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్‌ తగ్గిన నెల వరకు ఆగాలా..? - కరోనా వార్తలు

సమస్య: మా కుటుంబ సభ్యులకు గత వారం కరోనా వచ్చి తగ్గిపోయింది. కొవిడ్‌ తగ్గిన తర్వాత నెల వరకు టీకా తీసుకోవద్దని విన్నాను. నిజమేనా?

covid news
కొవిడ్‌ తగ్గిన నెల వరకు ఆగాలా

By

Published : Apr 12, 2021, 10:56 PM IST

Updated : Jun 8, 2021, 3:38 PM IST

సలహా: నిజమే. కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నాక నెల వరకు కరోనా టీకా తీసుకోవద్దు. ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డప్పుడు ఒంట్లో యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఇలాంటి స్థితిలో టీకా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ తికమకపడిపోవచ్చు. దీని మీద భారం పెరగొచ్చు. అందువల్ల నెల వరకు ఆగటమే మంచిది. అప్పటికి యాంటీబాడీల ఉత్పత్తి కాస్త నెమ్మదిస్తుంది. అప్పుడు టీకా తీసుకుంటే మరింత రక్షణ లభిస్తుంది.

ఇన్‌ఫెక్షన్‌తో పుట్టుకొచ్చిన యాంటీబాడీలు ఉంటాయి కదా. మళ్లీ టీకా ఎందుకనే సందేహం రావొచ్చు. చాలామందిలో జబ్బు నుంచి పూర్తిగా కాపాడేంత స్థాయిలో యాంటీబాడీలు తయారుకావటం లేదు. అందువల్ల ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారూ టీకా తీసుకోవటం తప్పనిసరి. నిజానికి ఆటలమ్మ, తట్టు వంటి ఇన్‌ఫెక్షన్లు వస్తే జీవితాంతం రక్షణ లభిస్తుంది. అంటే మరోసారి రావన్నమాట. కానీ కొవిడ్‌-19లో అలాంటిది కనిపించటం లేదు. దీనికి కారణం- యాంటీబాడీలు తగినంతగా తయారుకాకపోవటం. తయారైనా ఎక్కువ కాలం ఉండకపోవటం. టీకాతోనూ సుమారు ఏడాది వరకే రక్షణ లభిస్తుంది. అంటే ఏటా టీకా తీసుకోవాల్సి ఉంటుందనే అర్థం.

Last Updated : Jun 8, 2021, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details