ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ సోకినంత మాత్రన జీవితం వృథా కాదు.. ఎందుకీ ఆత్మహత్యలు? - కరోనా భయంతో ఆత్మహత్యలు న్యూస్

ఎటు చూసినా కరోనా పరిస్థితులు నెలకొన్న వేళ.. కుటుంబాల్లో భయాందోళలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ సోకిందన్న భయంతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనవు చాలిస్తూ.. కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. కొవిడ్‌ రోగుల్లో కనీసం 30 శాతం మందిలో ఇలాంటి భయమే ఉంటోందంటున్న వైద్యులు.. ఇది సరికాదని.. మానసికంగా దృఢంగా ఉంటే తేలికగా వైరస్‌ను జయించవచ్చని చెబుతున్నారు. పాజిటివ్‌గా తేలితే జీవితం వృథా అనే భావన నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.

dont sucide with fear of corona
dont sucide with fear of corona

By

Published : May 6, 2021, 3:47 AM IST

Updated : May 6, 2021, 6:07 AM IST

కొవిడ్ సోకినంత మాత్రన జీవితం వృథా కాదు.. ఎందుకీ ఆత్మహత్యలు?

కరోనా వైరస్ కన్నా.. ఆ మహమ్మారి మనకు వస్తుందేమోనన్న భయమే మనిషిని సగం చంపేస్తుంది. కృష్ణా జిల్లాలో 15 రోజుల్లోనే నలుగురు వైరస్‌ భయంతో బలవన్మరణాలకు పాల్పడ్డారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విజయవాడలో క్వారంటైన్ సెంటర్​లో కరోనాకు చికిత్స పొందుతూ.. ఉన్నట్టు ఉండి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరం మండలంలో హరిబాబు అనే వృద్ధుడి కరోనా పరీక్ష చేయించుకుంటే వైరస్‌ నిర్ధరణ అవుతుందనే భయంతో చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విజయవాడకు చెందిన పవన్‌కుమార్‌ కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినా.. ఆరోగ్యం కుదుటపడనందున ఆందోళనకు గురై ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కరోనా వచ్చిందని.. కాలవలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. వైరస్‌ భయం ఇలా చాలామందిని ప్రాణాలు తీసుకొనేలా చేస్తోంది.

తనకు వైరస్‌ సోకితే పరిస్థితి ఎలా ఉంటుంది? చికిత్స అందుతుందా? మరణం తప్పదా? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ఒకవేళ కొవిడ్‌ సోకితే.. తాను జీవించడం వృథా అనే భావన వారిలో వస్తుందని చెబుతున్నారు. కుంగుబాటుకు లోనటవంతో పరిస్థితులు ఆత్మహత్యకు దారితీస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

పాజిటివ్‌ వచ్చిన తర్వాతే కాదు.. రాకముందే మానసికంగా సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మరణం ఒక్కటే పరిష్కారం కాదని.. వైరస్‌ను జయించే మార్గాలపై దృష్టిపెట్టాలంటున్నారు.

ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆశావహ దృక్పథాన్ని కల్గించాలి. దీని వల్ల కుటుంబంలో ధైర్యం వస్తుంది. ఇంటి నుంచి ఇది మొదలైతే, సమాజంలో మార్పు వస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:స్ట్రెయిన్ ఎన్440కె పై ప్రభుత్వం అప్రమత్తంగా లేదు: చంద్రబాబు

Last Updated : May 6, 2021, 6:07 AM IST

ABOUT THE AUTHOR

...view details