కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కోరారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు... రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు ఎదుర్కోవటంపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం కల్పించే విషయంపై చర్చిస్తున్నామని, త్వరలోనే ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేస్తున్నామని మంత్రి తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ప్రయాణాలు చేయొద్దని ఆళ్ల నాని కోరారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: మంత్రి ఆళ్ల నాని - ఏపీలో జనతా కర్ఫ్యూ వార్తలు
కరోనాపై పోరుకు ప్రజల సాయం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
alla nani