ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దాతల దాతృత్వం..సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ - ఏపీ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

కరోనాపై పోరు కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌-19 నివారణ, సహాయచర్యల కోసం పలువురు దాతలు సీఎం జగన్​ను కలిసి చెక్కులు అందించారు.

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

By

Published : Apr 22, 2020, 3:21 AM IST

కొవిడ్‌-19 నివారణ, సహాయచర్యల కోసం..ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు.. తరఫున కోటి రూపాయలు విరాళమిచ్చారు. ఏపీ మార్క్​ఫెడ్ ఉద్యోగుల తరఫున లక్షా 7 వేల రూపాయలు విరాళమిచ్చారు. ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన మార్క్​ఫెడ్ ఛైర్మన్ వై. మధుసూదనరెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు చెక్కులు అందించారు. ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ తరఫున కోటి రూపాయలు, కార్పొరేషన్‌ ఉద్యోగులు తరఫున మరో 7 లక్షల 77 వేల 979 రూపాయలు విరాళం అందించారు. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ వై.భానుప్రకాష్ చెక్కులను ముఖ్యమంత్రికి అందించారు. ఏపీ ఆయిల్‌ సీడ్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(ఏపీ ఆయిల్‌ ఫెడ్‌) తరఫున 50 లక్షలు, ఉద్యోగులు ఒక రోజు వేతనం లక్షా 86 వేల 936 రూపాయలను సీఎంఆర్ఎఫ్​కు విరాళంగా ఇచ్చారు. ఆయిల్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ వై.మధుసూధనరెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ వీసీ అండ్‌ ఎండీ కంఠనాథరెడ్డి ముఖ్యమంత్రికి చెక్కు అందించారు.

ABOUT THE AUTHOR

...view details