ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు లారస్ ల్యాబ్స్ రూ.4కోట్ల విరాళం - ఏపీ సీఎం సహాయనిధికి విరాళాలు

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం లారస్ ల్యాబ్స్ నడుం బిగించింది. రూ. 4కోట్ల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించింది. కొవిడ్ నియంత్రణ కోసం విట్ ఫౌండేషన్ రూ.50 లక్షల విరాళాన్ని అందించింది.

donations to cmrf
donations to cmrf

By

Published : Jul 28, 2021, 10:25 PM IST

నాడు నేడు పథకం రెండో విడతలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు లారస్ ల్యాబ్స్ అనే సంస్థ ముందుకొచ్చింది. సీఎం సహాయ నిధికి రూ.4 కోట్ల రూపాయలు అందించింది. గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని నాలుగు మండలాల్లో మౌలిక సదుపాయలు కల్పించాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థించారు. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ ఆ జాబితాలో ఉన్నాయి.

కొవిడ్ నియంత్రణ చర్యల కోసం విట్ ఫౌండేషన్ రూ.50 లక్షల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​ను కలిసి చెక్​ను అందించారు.

ఇదీ చదవండి:'అన్ని వర్గాల వారికి సమన్యాయం అందించడమే ప్రభుత్వం లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details