కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్కు.. దాతలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపించారు. నాగాయలంక గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, లిఖిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు రూ. 5.63 లక్షల విలువైన 7 కాన్సన్‌ట్రేటర్లు హైదరాబాద్ నుంచి ఆసుపత్రికి పంపించారు. అదే గ్రామానికి చెందిన ఉప్పులూరి లక్ష్మీ కామేశ్వరరావు జ్ఞాపకార్ధం వారి మనుమలు, మనుమరాళ్లు కలసి ఒక కాన్సంట్రేటర్, పులిగడ్డ గ్రామానికి చెందిన దివంగత నేత రాజగోపాలరావు జ్ఞాసపకార్ధం వారి మేనల్లుడు రత్నశేఖర్ మరో కాన్సంట్రేటర్ను ఆసుపత్రికి అందించారు.
ఇప్పటివకు ఉన్నవి 12 సిలిండర్లే..