ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాట్సప్‌ ద్వారా గృహహింస ఫిర్యాదులు - గృహ హింస ఫిర్యాదు నెంబర్లు

గృహ హింసపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు వాట్సప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆశ్రయం దొరకని మహిళలు, గృహహింస బాధితులు, వలస మహిళా కూలీలు, గర్భిణులు వైద్య సహాయం కోసం సంబంధిత నంబర్లకు సమాచారం అందిస్తే తక్షణమే న్యాయం చేస్తామని వెల్లడించారు.

వాట్సప్‌ ద్వారా గృహహింస ఫిర్యాదులు
వాట్సప్‌ ద్వారా గృహహింస ఫిర్యాదులు

By

Published : Apr 24, 2020, 11:04 AM IST

గృహ హింసపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు 63014 11137 వాట్సప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. దీంతోపాటు 97010 56808, 96039 14511 వాట్సప్‌ నంబర్లతో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నంబర్లలో రాష్ట్ర మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ సూయజ్‌, కార్యదర్శి నిర్మల అందుబాటులో ఉంటారని చెప్పారు. ఆశ్రయం దొరకని మహిళలు, గృహహింస బాధితులు, వలస మహిళా కూలీలు, గర్భిణులు వైద్య సహాయం కోసం ఈ నంబర్లకు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి న్యాయం చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details