ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRISHNA WATER: 'కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం పట్టింపు వీడాలి' - MLC Dokka Manikya Varaprasad blamed Telangana

కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం అనవసర వివాదాన్ని రేపుతోందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం దుందుడుకు చర్యలను ఆపి రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

By

Published : Jul 6, 2021, 3:37 PM IST

కృష్ణా జలాలపై తెలంగాణా రాష్ట్రం అనవసరపు వివాదాన్ని రేపుతోందని వైకాపా ఎమ్మెల్సీ డొక్కామాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. వివాదాలను సామరస్యంగా , రాజ్యాంగ స్పూర్తితో పరిష్కరించుకోవాల్సిన అవసరముందని అన్నారు.

తెలంగాణా రాష్ట్రం దుందుడుకు చర్యలను ఆపి రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన విమర్శించారు. నీటి జలాల వివాదాలపై గతంలో బాబూ జగజ్జీవన్ రామ్ సూచించిన పరిష్కరాన్ని తెలుగు రాష్ట్రాలు ఆచరించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణా ప్రభుత్వం అనవసరపు పట్టింపులను వీడనాడాలని డొక్కా వ్యాఖ్యానించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details