హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద ఉన్న రామయ్యను దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు ఓ ఆశ్చర్య ఘట్టాన్ని తిలకించారు. ఆలయ ధ్వజ స్తంభం చుట్టూ తెల్లవారుజామున ఓ శునకం ప్రదక్షిణలు చూసి పరవశించిపోయారు.
ఆ అమోఘ ఘట్టాన్ని భక్తులు తమ చరవాణీల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.