ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటి నుంచి కదలకుండానే వైద్యం - ఏపీలో టెలీ మెడిసిన్ న్యూస్

లాక్‌డౌన్‌ కారణంగా ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆసుపత్రులకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారి కోసం ఇప్పుడు ఆసుపత్రులు టెలీ మెడిసిన్ ద్వారా సేవలు అందిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఇళ్లలోని రోగులకు ఆసుపత్రి నుంచే సేవలు అందజేస్తున్నారు.

doctors treatment with tele medicine
doctors treatment with tele medicine

By

Published : Mar 28, 2020, 5:19 AM IST

లాక్‌డౌన్‌ వల్ల ప్రైవేటు ఆసుపత్రులు ముందుగా తీసుకున్న వైద్యుల అపాయింట్ మెంట్లన్నింటినీ రద్దు చేశాయి. నెలవారీ చెకప్​లకు వెళ్లే వారికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు.... ఆసుపత్రులకు వెళ్లలేని వారికి టెలీ మెడిసిన్ ద్వారా కొన్ని ఆసుపత్రులు వైద్య సాయం అందిస్తున్నాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారికి వీడియో కాల్ ద్వారా వైద్య చికిత్స అందిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్‌, వీడియో కాల్ ద్వారా వైద్యులను సంప్రదించేందుకు ఈ ఆసుపత్రులు ప్రత్యేకమైన నెంబర్లు ఇచ్చాయి. సాధారణ సమస్యలైతే ఫోన్​లోనే ఏ ఔషధాలు వినియోగించాలో వైద్యులు చెబుతున్నారు. ఏదైనా శరీరంపై గాయాలు, ఈసీజీ, కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు టెలీ మెడిసిన్ వీడియో కాల్ ద్వారా రోగులను వైద్యులు పరిశీలిస్తున్నారు.

టెలీ మెడిసిన్ సౌకర్యం ఉన్న ఆసుపత్రికి వైద్య సలహాల కోసం రోజుకు 500 నుంచి 600 మంది వరకూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీడియో ద్వారా ఒక్కో వైద్యుడు 20 నుంచి 25 మంది రోగులను పరిశీలించి వైద్య సలహాలు అందిస్తున్నారు. లాక్‌ డౌన్‌ వంటి సమయంలో టెలీ మెడిసిన్ విధానం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంటి నుంచి కదలకుండానే వైద్యం

ఇదీ చదవండి: వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్'​

ABOUT THE AUTHOR

...view details