మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ విచారణ కోరిన జగన్... ఎందుకు వెనక్కి తగ్గారో చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామ్యయ డిమాండ్ చేశారు. ఆయన హత్యకు గురై రేపటితో సంవత్సరం గడుస్తుందని, కనీసం అదైనా సీఎంకు గుర్తుందా అని ప్రశ్నించారు. ఏడాది కాలంగా దర్యాప్తు చేస్తున్న సిట్.. ఏం తేల్చిందని అడిగారు. ఈ అంశాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.
'జగన్ గారు.. మీ బాబాయి వర్థంతైనా గుర్తుందా?' - జగన్ పై వర్ల రామయ్య కామెంట్స్
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరిన ముఖ్యమంత్రి జగన్... ఇప్పడెందుకు వెనక్కి తగ్గారని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. వివేకా హత్యలో చంద్రబాబు, లోకేశ్ హస్తం ఉందని అసత్య ఆరోపణలు చేశారని అన్నారు.
తెదేపా నేత వర్ల రామయ్య
Last Updated : Mar 15, 2020, 12:02 AM IST