ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దు : హైకోర్టు - ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ భూములు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి చెందిన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిలకు నోటీసులు జారీ చేస్తూ...పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పేర్కొంది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Mar 18, 2020, 4:21 AM IST

గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి చెందిన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వర్సిటీ భూముల్లో ఇళ్ల స్థలాల మంజూరు, గృహ సముదాయాన్ని నిర్మించకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.., వర్సిటీకి చెందిన 110 ఎకరాల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ , సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ , స్టేట్ సీడ్ పాం, తదితర సంస్థల ఏర్పాటు కోసం భూములు కేటాయించారని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆ భూముల్ని చదును చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం....వర్సిటీకి చెందిన భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని అధికారుల్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిలకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details