ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

dj tillu movie: విజయవాడలో సందడి చేసిన 'డీజే టిల్లు' చిత్ర బృందం - latest news in vijayawada

dj tillu: విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్‌లో డీజే టిల్లు చిత్ర బృందం సంద‌డి చేసింది. చిత్ర విజ‌యోత్సవ యాత్రలో భాగంగా నగరంలోని మాల్‌కు వ‌చ్చి,ప్రేక్షకులతో క‌లిసి కాసేపు సినిమా చూశారు.

dj tillu movie celebrations
విజయవాడలో డీజే టిల్లు చిత్ర బృందం

By

Published : Feb 15, 2022, 10:36 AM IST

dj tillu movie celebrations: డీజే టిల్లు చిత్ర బృందం విజయవాడలో సంద‌డి చేసింది.సినిమా హీరో, హీరోయిన్​ సిద్ధూ జొన్నల‌గ‌డ్డ, నేహ శెట్టి , దర్శకుడు విమ‌ల్ కృష్ణ‌లు చిత్ర విజ‌యోత్సవ యాత్రలో భాగంగా న‌గ‌రంలోని ట్రెండ్‌సెట్ మాల్‌కు వ‌చ్చారు. అక్కడ ప్రేక్షకులతో క‌లిసి కాసేపు సినిమా చూశారు. డీజే టిల్లు చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని చిత్ర క‌థానాయ‌కుడు సిద్ధూ జొన్నల‌గ‌డ్డ తెలిపారు. తెలంగాణ యాస‌లో ఉన్న సంభాష‌ణ‌ల‌కు యువ‌త నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంద‌న్నారు. చిత్ర హీరో, కథానాయికతో సెల్ఫీలు దిగేందుకు యువ‌త పోటీప‌డ్డారు.

విజయవాడలో డీజే టిల్లు చిత్ర బృందం

"విజ‌య‌వాడ అన్నా, ఇక్కడి ఆహారం అన్నా అమిత‌మైన ఇష్టం"

జొన్నల‌గ‌డ్డ సిద్ధూ, డీజే టిల్లు హీరో

ఇదీ చదవండి:DJ Tillu Review: 'డీజే టిల్లు' మోతమోగించాడా?

ABOUT THE AUTHOR

...view details