విజయవాడ ఇంద్రకీలాద్రి(kanaka durga temple)పై దీపావళి సందర్భంగా దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ తదితరులు అమ్మవారి ప్రధానాలయంలో ధనలక్ష్మి పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించారు.
kanaka durga temple: కనకదుర్గమ్మకు పంచహారతులు - కనకదుర్గమ్మ దేవాలయంలో దీపావళి పూజలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయంలో ధనలక్ష్మి పూజ నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని మూసివేశారు.
kanaka durga temple
సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవ నిర్వహించారు. ఆ తర్వాత ఏడు గంటలకు ప్రధాన ఆలయం, ఉపాలయములు మూసివేశారు. తిరిగి రేపు ఉదయం యథావిధిగా భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు.
ఇదీ చదవండి