ప్రేమోన్మాది చేతిలో బలైన విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. సీఎం జగన్కు కలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఘటన జరిగిన తీరును వివరించారు. యువతి కుటుంబసభ్యులను హోంమంత్రి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి దేవినేని అవినాష్ సీఎం వద్దకు తీసుకువెళ్లారు. బాధిత కుటుంబం సీఎం జగన్కు వినతి పత్రం అందించింది. తమకు న్యాయం చేయాలని కోరింది. నిందితుడిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. యువతి కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
విజయవాడ యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం - vijayawada girl murder news
విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంజినీరింగ్ యువతి తల్లిదండ్రులు సీఎం జగన్ను కలిశారు. యువతిపై జరిగిన దాడి ఘటనను సీఎంకు వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు.
cm jagan