ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

New Districts: 'జిల్లాల విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం'

జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు.. ప్రణాళిక విభాగం ఎక్స్​ అఫీషియో కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వీలైనవి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం ఏప్రిల్ రెండో తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పని మొదలవుతుందని చెప్పారు.

జిల్లాల విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం
జిల్లాల విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం

By

Published : Feb 23, 2022, 4:33 PM IST

జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు.. ప్రణాళిక విభాగం ఎక్స్​ అఫీషియో కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వీలైనవి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అభ్యంతరాలు, సూచనలకు నెల రోజులు సమయమిచ్చామని.., ప్రాథమిక స్థాయిలో జిల్లాల వారీగా అభ్యంతరాల పరిశీలన జరగుతోందన్నారు.

అన్ని అంశాలు పరిశీలించి కలెక్టర్లు నివేదిక ఇస్తారని తెలిపారు. మార్చి 10లోపు ప్రభుత్వానికి నివేదిక అందుతుందని.., అదే రోజు ఫైనల్‌ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం ఏప్రిల్ రెండో తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పని మొదలవుతుందని చెప్పారు.

ఉద్యోగులు, వనరుల విభజనపైనా అధ్యయనం జరుగుతోందని విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. జోన్ల వ్యవస్థ ఏర్పాటులో నెల్లూరులో ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ఉద్యోగులను ఇప్పటికిప్పుడు విభజన చేయట్లేదని.., తాత్కాలిక కేటాయింపులు జరుగుతాయన్నారు. రాష్ట్రపతి ఆమోదం వచ్చాక ఉద్యోగులు, జోనల్‌ విభజన ఉంటుందన్నారు. ప్రాంతాల సర్దుబాటు చేయాలని కొన్ని డిమాండ్లు వస్తున్నాయని.., అధికారుల స్థాయిలోనే అభ్యంతరాలు పరిష్కారమయ్యే అవకాశముందన్నారు.

ప్రస్తుతం ఎక్కడా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజన చేయట్లేదని చెప్పారు. తుది నోటిఫికేషన్ సిద్ధమైనప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 3 లక్షల చ. అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

"జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చాం. అన్ని అంశాలు పరిశీలించి కలెక్టర్లు నివేదిక ఇస్తారు. మార్చి 10వ తేదీనే ఫైనల్‌ నోటిఫికేషన్ ఇస్తాం. ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులు, వనరుల విభజనపైనా అధ్యయనం జరుగుతోంది. ఉద్యోగులను ఇప్పటికిప్పుడు విభజన చేయట్లేదు. తాత్కాలిక కేటాయింపులు జరుగుతాయి. రాష్ట్రపతి ఆమోదం వచ్చాక ఉద్యోగులు, జోనల్‌ విభజన ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజన చేయట్లేదు. తుది నోటిఫికేషన్ సిద్ధమైనప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. 3 లక్షల చ. అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు." -విజయ్‌కుమార్‌, ప్రణాళిక విభాగం ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి

ఇదీ చదవండి : Somu Fire: ఆయన రాజధాని కట్టలేదు.. ఈయన లేకుండానే చేశారు: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details