విజయవాడ రైల్వే మైదానంలో అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్, కృష్ణా జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 21వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. అండర్-17 విభాగంలో గెలుపొందిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ జరగనుందని.. ఆ పోటీల్లో మన రాష్ట్ర జట్టు పాల్గొంటుందన్నారు. రెండు దశాబ్దాల తర్వాత విజయవాడ వేదికగా ఈ టోర్నీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
విజయవాడలో అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం - football tournament vijayawada news
విజయవాడ రైల్వే మైదానంలో అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. అండర్-17 విభాగంలో గెలుపొందిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
విజయవాడలో అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం