విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలోని రైతు బజార్లో... విజయవాడ పురపాలక సంస్థ(వీఎంసీ), ఎంజే నాయుడు ఆసుపత్రి ఆధ్వర్యంలో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటుచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకంలో భాగంగా ఈ స్ప్రింక్లర్ ఛాంబర్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఈ ఛాంబర్ ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ ఛాంబర్ ద్వారా వెళ్లే వారిపై కోర్లినేటెడ్ ద్రావణాలు పడతాయని.. వైరస్ నాశకాలుగా అవి ప్రభావం చూపిస్తాయని తెలిపారు.
రైతు బజార్లో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటు - ఏపీ కరోనా వార్తలు
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలోని రైతు బజార్లో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటుచేశారు. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా వీఎంసీ, ఎంజే ఆసుపత్రి ఆధ్వర్యంలో స్ప్రింక్లర్ ఛాంబర్ ఏర్పాటుచేశారు. కూరగాయల కోసం వచ్చి, వెళ్లే వారు ఈ ఛాంబర్ ద్వారా వెళ్లాలని నిర్వాహకులు కోరారు.
విజయవాడ రైతు బజార్లో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్