Rape Incident: విజయవాడ అత్యాచార ఘటన.. నున్న సీఐ, ఎస్ఐలు సస్పెన్షన్ - Vijayawada rape case
11:01 April 22
కుమార్తె కనిపించలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై చర్యలు
Vijayawada rape incident: విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై పోలీసుల చర్యలు చేపట్టారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనలో ఇద్దరు పోలీసులను సీపీ కాంతిరాణాటాటా వేటు వేశారు. విధుల్లో అలసత్వం వహించినందుకు గాను సిఐ హనీష్, సెక్టార్ ఎస్‌ఐ శ్రీనివాసరావులను సస్పెండ్ చేశారు. కుమార్తె కనిపించలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై ఈ చర్యలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..నిత్యం జనంతో రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన ఓ యువతి (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 30 గంటలపాటు ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఓ ఇరుకు గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు. అప్పటి వరకూ ఇంటి వద్దనున్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లగా.. స్పందించకుండా సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించేశారు. చివరిసారిగా ఫలానా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని ఆధారమిచ్చినా సరే వెంటనే చర్యలు చేపట్టలేదు.