ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RGV Tweet: 'ఒమెగా స్టార్' జగన్​కు నా ధన్యవాదాలు: ఆర్జీవీ

సూపర్‌, మెగా, బాహుబలి స్థాయి బెగ్గింగ్‌ వల్లే ముఖ్యమంత్రి జగన్ సినిమా టికెట్ల ధరలను సవరించారని సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 'ఒమెగా స్టార్ జగన్​కు ధన్యవాదాలు తెలుపుతున్నా' అని అన్నారు.

ఆర్జీవీ
ఆర్జీవీ

By

Published : Feb 11, 2022, 3:51 PM IST

ముఖ్యమంత్రి జగన్​తో సినీ ప్రముఖుల చర్చల అంశంపై సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమల మధ్య ఉద్రిక్తతలను తొలగించి సంతోషకర ప్రయాణానికి పునాది వేశారన్నారు. సూపర్‌, మెగా, బాహుబలి స్థాయి బెగ్గింగ్‌ వల్లే ముఖ్యమంత్రి జగన్ సినిమా టికెట్ల ధరలను సవరించారన్నారు. 'ఒమెగా స్టార్‌' జగన్‌కు తన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

"ఏపీ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య ఉద్రిక్తతను తొలగించారు. చిత్ర పరిశ్రమ సంతోషకర ప్రయాణానికి పునాది వేశారు. సూపర్‌, మెగా, బాహుబలి స్థాయి బెగ్గింగ్‌ వల్లే ఇది సాధ్యమైంది. ఒమెగా స్టార్‌ జగన్‌కు నా ధన్యవాదాలు."- ట్వీటర్​లో రామ్‌గోపాల్‌ వర్మ

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..

సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో.. పరిశ్రమ తరపున చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు పాల్గొన్నారు.

జగన్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితోపాటు ఉన్నతాధికారులూ పాల్గొన్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా.. టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం జగన్​ చర్చించారు.

అందరికీ న్యాయం జరిగేలా ప్రయత్నించాం..
ప్రేక్షకులకు భారం కాకుండా, సినీ పరిశ్రమకు మేలు చేసేలా టికెట్ల ధరలు సవరించామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇవి ఎవరికైనా మంచి రేట్లేనని, అందరికీ న్యాయం జరిగేలా ప్రయత్నించామని చెప్పారు. హీరో, హీరోయిన్‌, దర్శకుడి పారితోషికం మినహాయించి రూ.100 కోట్ల కంటే ఎక్కువ నిర్మాణ వ్యయంతో తీసే భారీ బడ్జెట్‌ సినిమాలను ప్రత్యేకంగా పరిగణిస్తామన్నారు. అలాంటి సినిమాల కోసం వారంరోజుల పాటు ప్రత్యేక ధరల్ని నోటిఫై చేస్తామని ప్రకటించారు. లేకపోతే భారీ సాంకేతికత, ఆవిష్కరణలతో పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ విశాఖపట్నం తరలిరావాలని, అక్కడ అందరికీ ఇళ్ల స్థలాలు, స్టూడియోల నిర్మాణానికి స్థలాలు ఇస్తామని ప్రకటించారు. అయిదో ఆట ప్రదర్శన వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని చెప్పారు. మల్టీఫ్లెక్స్‌లకు కూడా మంచి ధరలు ఇస్తామని వివరించారు. సినిమా షూటింగ్‌లో కనీసం 20% మేర ఆంధ్రప్రదేశ్‌లో జరిగేలా నిబంధన తీసుకొస్తామని తెలిపారు.

భారీ బడ్జెట్‌ సినిమాలకు వారంపాటు ప్రత్యేక ధరలు..
‘‘సినీ పరిశ్రమలో ఉన్న కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడేందుకు ఓ మంచి వ్యవస్థను క్రియేట్‌ చేసే ఉద్దేశంతో అడుగులు వేశాం. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేకుంటే ఎక్కువ, తక్కువ వసూళ్లు జరుగుతాయి. నేను, చిరంజీవి కలిసి కూర్చొని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో, హీరోయిన్‌, దర్శకుడు పారితోషికం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే.. నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలి. అలా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. అలాంటి సినిమాలకు వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్‌ చేయాలని అనుకున్నాం."- సీఎం జగన్

ఇదీ చదవండి

సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణకన్నా ఏపీ సహకారమే ఎక్కువ: జగన్

ABOUT THE AUTHOR

...view details