DIRECTOR RAGHAVENDRA RAO ON ONLINE MOVIE TICKETS: ఆన్‌లైన్ టికెట్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని సినీ దర్శకులు రాఘవేంద్ర రావు విజ్ఞప్తి చేశారు. థియేటర్ యజమానులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ టికెట్లు, షోల నిర్ణయంతో తీవ్ర నష్టాలు చవిచూడవలసిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
RAGHAVENDRA RAO ON TICKETS: టికెట్ల ఆన్‌లైన్ విధానంపై పునరాలోచించండి: రాఘవేంద్ర రావు
ONLINE MOVIE TICKETS: సినిమా టికెట్ల ఆన్‌లైన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం పురనరాలోచించాలని దర్శకులు రాఘవేంద్ర రావు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలకు నష్టం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టికెట్ల ధర, షోలు తగ్గించడం వల్ల అంతా నష్టపోతారని రాఘవేంద్ర రావు అన్నారు. ఆన్‌లైన్ టికెట్లను కొందరు బ్లాక్ చేయడం ద్వారా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. టికెట్లను బ్లాక్ చేసి.. బ్లాకులో అమ్మే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. టికెట్ల ధర పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే ప్రభుత్వానికి లాభమని సూచించారు. 40 ఏళ్లుగా దర్శకుడిగా, నిర్మాతగా ఉన్నానని.. తన అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలని రాఘవేంద్రరావు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:TTD EO TO PILGRIMS: తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో