MAHANADU: మహానాడుకు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు తరలి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. మహానాడులో అంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు సంతకం చేసిన డిజిటల్ ఆహ్వాన పత్రికలను పంపారు. ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చతోపాటు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధాలను ఎండగట్టనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడంతోపాటు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పలికిన ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఏటా పార్టీ ప్రతినిధుల మహానాడు జరుపుకోవటం.. తెలుగుదేశం సంప్రదాయమని ఆహ్వానంలో గుర్తు చేశారు. మహానాడు సందర్భంగా ప్రత్యేక వాట్సప్ డీపీని తెలుగుదేశం విడుదల చేసింది.
MAHANADU: మహానాడుకు.. డిజిటల్ ఆహ్వాన పత్రికలు..! - మహానాడుకు డిజిటల్ ఆహ్వాన పత్రికలు
MAHANADU: ఈ నెల 27, 28న ఒంగోలు వేదికగా నిర్విహిస్తున్న మహానాడుకు తెలుగుదేశం ఆత్మీయ కుటుంబ సభ్యులు తరలి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. మహానాడులో అంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు సంతకం చేసిన డిజిటల్ ఆహ్వాన పత్రికలను పంపారు.
మహానాడుకు.. డిజిటల్ ఆహ్వాన పత్రికలు