ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

diesel price: రాష్ట్రంలో రూ.100 దాటేసిన డీజిల్ ధర - డీజిల్ ధరలు న్యూస్

ఏపీలో డీజిల్ ధర(diesel price) రూ.100 దాటేసింది. చిత్తూరు(chittoor) జిల్లా కుప్పంలో లీటర్ డీజిల్ రూ.100.07 అయింది. పెట్రోలు ధరలూ పెరిగిపోయాయి.

diseal rates
diseal rates

By

Published : Jun 27, 2021, 4:18 AM IST

రాష్ట్రంలో డీజిల్‌ ధర(diesel price) శతకం దాటేసింది. శనివారం చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు డీజిల్‌ రూ.100.07 అయింది. ఇదే ప్రాంతంలో పెట్రోలు ధర రూ.106.25కి చేరింది. ఇక్కడే కాదు.. పలు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రోలు ధర రూ.105 దాటేయగా.. డీజిల్‌ రూ.100కి చేరువగా వచ్చింది.

  • దేశంలో ఇంధన ధరలు అత్యధికంగా ఉండే రాజస్థాన్‌లోని గంగానగర్‌లో డీజిల్‌ ధర వారం కిందటే రూ.100 దాటేసింది. అక్కడ ఇప్పుడు లీటరు పెట్రోలు(petrol) రూ.109.30, డీజిల్‌ రూ.101.85 చొప్పున ఉంది.
  • ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల లీటరు పెట్రోలు ధరలు రూ.105 పైనే ఉన్నాయి. గుంటూరు జిల్లా మాదిపాడు, కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, వింజమూరు, కలిగిరి, సంగం, తూర్పు గోదావరి జిల్లా నెల్లిపాక, చట్టి, శ్రీకాకుళం జిల్లా సోంపేట, కంచిలి, మెలియాపుట్టి, బిరుసువాడ, చిత్తూరు జిల్లా బంగారుపాళెం, పలమనేరు, బైరెడ్డిపల్లి, సోమల, వి.కోట, అనంతపురం జిల్లా హిందూపురం, పరిగి, అగలి, కర్నూలు జిల్లా శ్రీశైలం, కడప జిల్లా పెనగలూరు తదితర ప్రాంతాల్లో లీటరు పెట్రోలు రూ.105పైనే విక్రయిస్తున్నారు. అక్కడ డీజిల్‌ ధరలు రూ.99పైనే ఉన్నాయి.
  • చిత్తూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో పెట్రో ధరలతో పోలిస్తే.. సమీపంలోని తమిళనాడు రాష్ట్ర పరిధిలో ఉన్న బంకుల్లో లీటరుకు రూ.4 నుంచి 5 వరకు తక్కువ.

ABOUT THE AUTHOR

...view details