ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది: తెదేపా నేతలు - varla ramaia on ycp govt

తాము వేసిన కేసులపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు కోరారు. వైకాపా నేతలకు భయపడి పోలీసులు తమ ఫిర్యాదులను పక్కన పెడుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. దాడుల విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది

By

Published : Sep 14, 2019, 7:00 PM IST

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది: తెదేపా నేతలు
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన జరుగుతుందని తెదేపా నేతలు ప్రభుత్వాన్ని విజయవాడలో విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై 223 దాడులు, 12హత్యలు జరిగాయని ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులు చేసే ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. తెదేపా కేసులు తీసుకుంటే వైకాపా ఎమ్మెల్యేలకు కోపం వస్తుందని...అందుకే పోలీసులు భయపడుతున్నారని ఆరోపించారు. డీజీపీ సవాంగ్ వెంటనే స్పందించి తాము వేసిన కేసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details