TDP leader Dhulipalla Narendra: సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రజారవాణాకు ఇబ్బందులు కలుగుతున్న అంశంపై తెలుగుదేశం సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర స్పందిచారు. జగన్ జిల్లాలు పర్యటించిన ప్రతిసారి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదంటూ దూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ హిట్లర్‌ను మించిపోయారని ధ్వజమెత్తారు. సీఎం పర్యటన అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించేలా ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వాడటం దారుణమన్నారు. ప్రజలు తిరగబడతారనే భయంతో ఎక్కడికెళ్లినా బారికేడ్లు పెట్టుకుంటున్నారని నరేంద్ర విమర్శించారు. త్వరలోనే ప్రజా తిరుగుబాటు తప్పదని పేర్కొన్నారు. వైకాపాను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు.
జగన్ పర్యటన అంటేనే జనం హడలిపోతున్నారు: దూళిపాళ్ల నరేంద్ర - జగన్ పర్యటనపై ఫైర్ అయిన దూళిపాళ్ల నరేంద్ర
Dhulipala Narendra: ముఖ్యమంత్రి జగన్ హిట్లర్‌ను మించిపోయారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సీఎం పర్యటన అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడతారనే భయంతో.. సీఎం జగన్ ఎక్కడికెళ్లినా బారికేడ్లు పెట్టుకుంటున్నారని ధూళిపాళ్ల విమర్శించారు.
దూళిపాళ్ల నరేంద్ర