వెనుకబడిన వర్గాలపై దాడులు జరిగిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తూ వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని.. మాజీఎమ్మెల్సీ, సీపీఐ నేత జెల్లీ విల్సన్ ఆరోపించారు. విజయవాడ దాసరి భవన్లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విల్సన్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.
'ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను ఇంకా ఎందుకు నియమించలేదు..?' - CPI wilson latest news
వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా... ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.
విజిలెన్స్ మానిటిరింగ్ కమిటీకి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి జగన్... వెనకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులపై ఎందుకు సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం అమలులో, దాడులను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇలాంటి తరుణంలో దళితులందరూ ఐక్యమై... దళిత సంఘాలు, అభ్యుదయవాదులు, పార్టీలకతీతంగా దళితుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దళిత వ్యతిరేక విధానాలపై పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్‌పై 10 శాతం వ్యాట్ పెంపు