తక్కువ బరువు, నెలలు నిండకముందే పుట్టిన చిన్నారులు నిలోఫర్‌లోని నియోనాటిల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్‌ఐసీయూ)లో చికిత్స పొందుతుంటారు. కొందరు ఇక్కడే జన్మించినవారు కాగా జిల్లా, మండల కేంద్రాల నుంచి మరికొందరిని తీసుకొస్తుంటారు. కొంతమంది గర్భిణుల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యల వల్ల నెలలు నిండకముందే కాన్పులు జరుగుతుంటాయి.
కేజీ కంటే తక్కువ బరువుతో జన్మిస్తున్న పిల్లలను ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షించాలి. ఒక్కోసారి నెల, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాలి. శిశువులతో తల్లులు అన్ని రోజులు ఆసుపత్రి బెడ్‌పై ఉండటం సాధ్యం కాదు. ఇంకొందరు తల్లుల్లో వివిధ కారణాలతో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే శిశువులకు నిలోఫర్‌లోని మిల్క్ బ్యాంకు నుంచి పాలు అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలంటే తల్లిపాలను మించింది లేదు.