వైకాపా అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు మూసి పేదవాడికి అన్నం పెట్టకుండా చేశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పేదలను చూస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో జే-ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. కేవలం జే-ట్యాక్స్ కట్టే కంపెనీలకు చెందిన మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్ముతున్నారన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా రేపు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల జాబితా నుంచి అర్హులను తొలగిస్తూ..ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ...వైకాపా పాలనలో పేద ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రేపు తలపెట్టిన ధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై..ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని కోరారు.
'అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా రేపు ధర్నాలు' - కొల్లు రవీంద్ర తాజా వార్తలు
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు మూసేశారని మాజీ మంత్రి కొల్లురవీంద్ర మండిపడ్డారు. పేద వాడికి అన్నం పెట్టకుండా చేశారని ఆక్షేపించారు. అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా రేపు ధర్నాలు నిర్వహిస్తామన్నారు.
అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా రేపు ధర్నాలు