విజయవాడలో సంచలనం రేపుతున్న ప్రేమోన్మాది దాడి ఘటన కేసు దర్యాప్తును విజయవాడ సీపీ స్వీయ పర్యవేక్షణలో జరిగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని డీజీపీ గౌతం సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరహా ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. దిశ స్ఫూర్తిగా ఈ కేసులో ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చిన్నారులు, మహిళలపై దాడులకు తెగబడితే ఉపేక్షించబోమన్నారు. సమాజంలో జరుగుతున్న వింతపోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డీజీపీ సవాంగ్ అభిప్రాయపడ్డారు.
'ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు'
విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సీపీ స్వీయ పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీచేశామన్న డీజీపీ... 'దిశ' స్ఫూర్తిగా ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నారులు, మహిళలపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉద్ఘాటించారు. వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వ్యాఖ్యానించారు.
డీజీపీ గౌతం సవాంగ్