అంతర్రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకునేవారు స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాలని ఆయన సూచించారు. స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయన్నారు.
అంతర్రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: డీజీపీ
స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకునేవారు స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాలని ఆయన సూచించారు.
అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: డీజీపీ
కరోనా ప్రభావం తక్కువ ఉన్నచోట నుంచి వచ్చేవారిని హోం క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నచోట నుంచి వచ్చేవారికి 7 రోజుల ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలన్నారు. ప్రభుత్వ క్వారంటైన్లో ఉంటూ కొవిడ్ టెస్టు చేయించుకోవాలని డీజీపీ వెల్లడించారు. కరోనా పాజిటివ్ వస్తే కొవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 7 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలన్నారు.
Last Updated : Jun 1, 2020, 11:35 AM IST