మూడు రోజుల పాటు జరిగిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 8,739 మంది చిన్నారులకు విముక్తి లభించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అందులో 7425 మంది బాలురు, 1314 మంది బాలికలు ఉన్నారన్నారు. వారిలో 205 మంది ఐదేళ్లలోపు, 1860 మంది 6 నుంచి 10 ఏళ్ల లోపు, 6674 మంది 11 నుంచి 15 ఏళ్ల లోపు వాళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ద్వారా 8,724 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా.. మరో 12 మందిని ఛైల్డ్కేర్ హోంలకు, ముగ్గురిని కొవిడ్ కేర్ కేంద్రంలో చేర్పించినట్లు చెప్పారు.
కొవిడ్ లక్షణాలు కలిగిన 1,982 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా.. 28 మంది చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లు డీజీపీ వెల్లడించారు. 1232 మంది పిల్లలకు నెగిటివ్ రాగా.. మరో 722 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారులకు.. సీఎం ఆదేశానుసారం పునరావాసం కల్పించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తామని వివరించారు.