మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై రాష్ట్ర నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసు విచారణలో రాష్ట్ర పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. కేసు దర్యాప్తును సీబీఐ చూస్తోందని వెల్లడించారు.
గంజాయి సాగు, రవాణా నియంత్రణకు ఒడిశాతో కలిసి పనిచేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెంచామన్నారు. కళాశాలలు, రిసార్టులు, కాటేజ్‌లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. సైబర్‌క్రైమ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు.