విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర శాఖల వారు కూడా ఘటనపై విచారణ చేస్తున్నారని డీజీపీ తెలిపారు.
స్వర్ణ ప్యాలెస్ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నాం: డీజీపీ - పరిపాలన రాజధానిపై డీజీపీ
స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరిపాలన వైజాగ్ నుంచి ప్రారంభిస్తే దానికి సిద్ధంగా ఉండాలని.. వైజాగ్ వెళ్ళివచ్చినట్లు డీజీపీ తెలిపారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్
ఒకవేళ పరిపాలన వైజాగ్ నుంచి ప్రారంభిస్తే దానికి సిద్ధంగా ఉండాలని ముందస్తు ప్రణాళికలో భాగంగా వైజాగ్ వెళ్ళి వచ్చినట్లు డీజీపీ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా వైజాగ్లో పర్యటించామన్నారు. ట్రాఫిక్ ప్లానింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలనే అంశాలపైనా ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించామన్నారు.
ఇదీ చదవండి: అంతం కాదిది ఆరంభం: రఘురామకృష్ణరాజు